ఇల్లు.. ఉపాధి.. చదువు..ఎంతో ఆనందంగా ఉంది

ఇల్లు.. ఉపాధి.. చదువు..ఎంతో ఆనందంగా ఉంది
  • మూసీ పునరావాస మహిళల మనోగతం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వం తమను ఆగం జేయలేదని, డబుల్​ బెడ్​ రూం ఇండ్లల్లో  సంతోషంగానే ఉన్నామని మూసీ పునరావాస మహిళలు పేర్కొన్నారు. మూసీ నుంచి తరలివచ్చినందుకు ప్రభుత్వం ఆదుకుంటున్నదని తెలి పారు. శుక్రవారం ప్రజాభవన్​లో మంత్రి సీతక్క చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్కులు అందుకున్న తర్వాత మూసీ పునరావాస మహిళలు మీడియాతో మాట్లాడారు.

‘‘ఇదివరకు మూసీ వద్ద భయపడుతూ బతికేవాళ్లం.  రేకుల ఇండ్లు, ఇరుకు గదులు, పురుగులు, విష కీటకాలు ఉండేవి. చీకటైతే భయంగా ఉండేది. ఇప్పుడు డబుల్ బెడ్​ రూం ఇండ్లలో భయం లేకుండా బతుకుతున్నం. ఇప్పటివరకు కూలి పనిజేసి బతికినం. అక్కడి నుంచి తరలించినందుకు సర్కారు మాకు రూ.2 లక్షల రుణం ఇస్తున్నది.

అందులో 70% సబ్సిడీ.. మిగతావి నెలనెలా కట్టేందుకు అవకాశం ఇచ్చింది. అక్కడినుంచి ఇక్కడికి షిఫ్ట్​ అయినందుకు రూ. 25 వేలు ఇస్తున్నది.  మా పిల్లలను స్కూల్​లో జాయిన్​ చేసిన్రు. ఇండ్లు, ఉపాధి, చదువు..మాకు ఇంకేం కావాలి” అని అన్నారు.