పోలీస్ స్టేడియంలో ‘ఉస్మానియా’ వద్దు

పోలీస్ స్టేడియంలో ‘ఉస్మానియా’ వద్దు

బషీర్ బాగ్: గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించొద్దని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. పలువురు స్టేడియంలోకి వెళ్లి శంకుస్థాపనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పోలీసులు అడ్డుకోవడంతో స్టేడియం బయట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారితోపాటు బీజేవైఎం నాయకులను పోలీసులు బేగంబజార్ పీఎస్ కు తరలించారు.