గురుకుల అడ్మిషన్ రిజల్ట్ ఇవ్వలేదు..గురుకుల సెట్ కన్వీనర్ అలుగు వర్షిణి

గురుకుల అడ్మిషన్ రిజల్ట్ ఇవ్వలేదు..గురుకుల సెట్ కన్వీనర్ అలుగు వర్షిణి

హైదరాబాద్, వెలుగు:గురుకుల అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ– 2025  రిజల్ట్ ను రిలీజ్ చేయలేదని ఎస్సీ గురుకుల సెక్రటరీ, ఎంట్రన్స్ సెట్ కన్వీనర్ అలుగు వర్షిణి తెలిపారు. రిజల్ట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, స్టూడెంట్స్, పేరెంట్స్ ఈ వార్తలను నమ్మెద్దని  గురువారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే మీడియాకు తెలియజేస్తామని, వెబ్ సైట్ లో ఫలితాలు ఉంచుతామని ఆమె చెప్పారు.