
తిర్యాణి, జైనూర్, వెలుగు: కర్ణాటకలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ల్యాంగేజ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వర్క్‌షాప్ లో ఆసిఫాబాద్ జిల్లా వాసులు పాల్గొన్నారు. జైనూర్, తిర్యాణి మండలాలకు చెందిన గోండి బాషా పండితులు కొట్నాక్ భీంరావు, చహకటి దశ్రు, భగవంత్ రావు హాజరయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో వాడే గోండి బాషా పదాలపై వర్క్‌షాప్ జరిగినట్లు వారు తెలిపారు. ఈ పరిశోధన ద్వారా స్పష్టమైన గోండి బాష డిక్షనరీని తయారు చేయను న్నట్లు వివరించారు.