
జీడిమెట్ల, వెలుగు: ఇందిరమ్మ కాలనీ ఫేజ్ -2 వాసులు బుధవారం నిజాంపేట కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట్కమిషనర్, హైడ్రా కమిషనర్ పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు మరో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై ఆక్రమణల పేరుతో పేద వారి రేకుల ఇండ్లు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే రోడ్డులో ఉన్న బడా బాబుల భవనాలు, ఇతర ఆక్రమణలు ఎందుకు కూల్చడం లేదన్నారు. పేదలకో న్యాయం, ధనవంతులకో న్యాయమా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కాలనీ, బాలాజీ హిల్స్‌లో సైతం రోడ్డుపైకి వచ్చిన ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై హైడ్రా కమిషనర్‌ను సైతం కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.