డబుల్​ ఇండ్ల కోసం వంటావార్పుతో నిరసన 

ఆందోళనకారుల కండ్లల్లో కారం చల్లిన బీఆర్ఎస్​ లీడర్లు

మోతె (మునగాల), వెలుగు : అర్హత లేని వారికి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఎలా ఉంటారని,  వెంటనే ఖాళీ చేయించాలని    మోతె మండలం అప్పన్నపేట లో స్థానికులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వారిపై  రావి పహాడ్ ఎంపీటీసీ సండ్ర పద్మ భర్త మధు,  బీఆర్ఎస్  లీడర్లు.. ఆందోళనకారుల కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. ఇంతలో పోలీసులు చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. అనంతరం పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో టెంటు వేసుకొని వంట వార్పు చేశారు.  ఆందోళన చేస్తున్న వారికి సీపీఎం నాయకులు మద్దతులు తెలిపారు. పేదలపై దాడిచేసినవారిపైన కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.  అర్హత లేని వారు నివాసం ఉంటున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఖాళీ చేయాలని గత కొంతకాలంగా అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారు పట్టించుకోవడం
 లేదన్నారు.