- గవర్నమెంట్ పథకాలకు అవసరమని భావించి ఎగబడుతున్న జనం
నిజామాబాద్, వెలుగు: క్యాస్ట్, ఇన్కమ్సర్టిఫికెట్ల కోసం జిల్లావాసులు పరుగులు పెడుతున్నారు. దరఖాస్తులు చేయడానికి మీ–సేవా సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. కాంగ్రెస్గవర్నమెంట్ ఇచ్చే పథకాలకు ఈ సర్టిఫికెట్లు అవసరమనే భావనతో ఒకరిని చూసి మరొకరు అర్జీలు పెట్టుకుంటున్నారు. దీంతో రోజుకు వేల సంఖ్యలు దరఖాస్తులు వస్తున్నాయి.
సద్దులు కట్టుకొని మరీ క్యూలో..
కాలేజీల అకాడమిక్ఇయర్ మొదలయ్యేటప్పుడు స్టూడెంట్స్ఈ సర్టిఫికెట్ల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దని త్వరగా సర్టిఫికెట్లు జారీ చేయడానికి తహసీల్దార్ ఆఫీసుల్లోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరగా వాటిని స్టూడెంట్స్‌కి అందిస్తారు. ఆ తర్వాత వీటికోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావు. కానీ సరిగ్గా వారం రోజుల నుంచి జిల్లాలో క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం వేలాదిగా అప్లికేషన్లు వస్తున్నాయి.
వచ్చిన దరఖాస్తుల ఎంక్వయిరీకే అధిక టైమ్ కేటాయించాల్సి వస్తోందని ఆఫీసర్లు వాపోతున్నారు. సిటీలో నాలుగు తహసీల్దార్ఆఫీస్లు ఉండగా రోజుకు నాలుగు వేలకు తగ్గకుండా అప్లికేషన్లు వస్తున్నాయి. బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ టౌన్లలోనూ ఇదే మాదిరి రద్దీ ఉంటోంది. మీ–సేవా సెంటర్లుఓపెన్ చేయకముందే జనాలు క్యూ కడుతున్నారు. పనిముగిసే దాకా ఉండడానికి సద్దులు కట్టుకొని మరీ వస్తున్నారు. ఎలక్షన్ టైమ్‌లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో గృహలక్ష్మి కింద ఇండ్లు, మహాలక్ష్మి పథకం పింఛన్, స్వయం ఉపాధి లోన్లకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలని నమ్మి పోటెత్తుతున్నారు.
ముందు జాగ్రత్తలో భాగంగా..
ఎలక్షన్‌కు ముందు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ఆగస్టులో బీసీ, దళిత బంధు పథకాలను ప్రకటించి, దరఖాస్తులు చేయడానికి గడువు కూడా సరిగా ఇవ్వలేదు. ఆయా పథకాలకు దరఖాస్తు చేయాలంటే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని చెప్పడంతో ఆయా సర్టిఫికెట్ల కోసం జనాలు వేల సంఖ్యలో క్యూకట్టారు. వీటిని పొందలేని చాలా మంది ఆయా పథకాలకు అప్లయ్ చేసుకోలేకపోయారు.
ఇప్పుడలాంటి పరిస్థితి ఏర్పడకుండా స్కీమ్‌ల మంజూరుకు గవర్నమెంట్ఎప్పుడు అడిగినా సర్టిఫికెట్లు ఇచ్చేలా ముందుగానే వీటిని పొందాలనే ఆరాటపడుతున్నారు. రూ.500లకు వంట గ్యాస్ సిలిండర్ పొందడానికి ఈకేవైసీ చేయించాలనే భ్రమతో ఇప్పటికే గ్యాస్ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ఉజ్వల్ యోజన కింద పేద కుటుంబాలకు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి ఈకేవైసీ తీసుకోడానికి ఈనెలాఖరు గడువు విధించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌తో ఆగిన ఈకేవైసీ పది రోజుల నుంచి పున:ప్రారంభమైంది. ఇది అందరూ చేయించుకోవాలనే భ్రమతో జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల జనం క్యూ కడుతున్నారు. అదనంగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల రద్దీ కొనసాగుతోంది.
ఎప్పుడడిగినా ఇవ్వడానికి..
ఇప్పుడే ఈ సర్టిఫికెట్లు అవసరమని భావించి దరఖాస్తు చేయలే. సర్కారు ఎప్పుడడిగినా ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకోవాలన్నదే ఆలోచన. సాధారణ టైమ్‌లో తీసుకొని పెట్టుకోవడం ఉత్తమమని భావించి అప్లికేషన్ పెట్టిన. మున్మందు టెన్షన్పడొద్దని ఆలోచనతో ప్రజలు దరఖాస్తులు పెడుతున్నారు. – నారాయణ, అప్లికెంట్
చెప్పినా వినడం లేదు
ఏరోజుకారోజు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఆకస్మాతుగా వీటికి ఇంత డిమాండ్ ఎందుకొచ్చిందనే సంగతి మొదట మాకు అర్థం కాలే. ఆఫీసర్లను అడిగినా గవర్నమెంట్ ఆదేశాలేవీ లేవని చెప్పారు. వందల సంఖ్యలో దరఖాస్తు చేయడానికి వస్తున్న వారికి చెప్పే ప్రయత్నం చేసినా వినడం లేదు.
సునీత, మీసేవా సెంటర్యజమాని