-
రోజంతా పొలాల్లో గడిపిన సూర్యాపేట జిల్లా కుతుబ్షాపురం వాసులు
గరిడేపల్లి, వెలుగు : ఊరిలో దాదాపు పదిమంది వరుసగా చనిపోవడంతో ఊరికి కీడొచ్చిందని జనమంతా ఒకరోజు ఊరు వదిలిపెట్టి వెళ్లారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలంలో కుతుబ్షా పురంలో ఆదివారం జరిగింది. ఈ మధ్యకాలంలో గ్రామంలోని జనం ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని పూజారిని అడగగా, ఆయన కీడు వచ్చిందని చెప్పడంతో మార్గం చెప్పమన్నారు. ఆయన సలహా మేరకు గ్రామస్తులంతా ఆదివారం ఉదయం నాలుగు గంటలకే ఊరొదిలి శివారులోని పొలాల బాట పట్టారు. అక్కడే వండుకొని తిని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు.