కొండాపూర్లోని ఈ ఏరియాలో హాస్టల్స్ వద్దంటూ స్థానికుల గొడవ

కొండాపూర్లోని ఈ ఏరియాలో హాస్టల్స్ వద్దంటూ స్థానికుల గొడవ

గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్లోని శ్రీరామ్​నగర్ ​కాలనీ ఏ బ్లాక్లో హాస్టల్స్​ ఏర్పాటును నిరసిస్తూ సోమవారం కాలనీ వాసులు ర్యాలీ చేపట్టారు. కాలనీలో హాస్టల్స్ను ఏర్పాటు చేస్తే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కాలనీ వెల్ఫేర్​ అసొసియేషన్​ ప్రెసిడెంట్​ శివకుమార్​ తెలిపారు.  తాగునీరు సరిపోకపోవడం, డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతాయన్నారు.

హాస్టల్స్​లో ఉండే వారు రాత్రి సమయాల్లో మద్యం తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. గొడవలు జరిగి న్యూసెన్స్​ క్రియేట్​ చేస్తారని పేర్కొన్నారు.  దీంతో పాటు పార్కింగ్ సమస్య ఏర్పడి ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ఇదే విషయంపై పోలీసు అధికారులకు, జీహెచ్​ఎంసీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అసొసియేషన్​ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.