
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, నాగాపూర్ సర్పంచ్ ఒంటరి రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. గ్రామ అభివృద్ధి విషయంలో, సంక్షేమ కార్యక్రమాల అమలులో నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి సహకారం లభించడంలేదని, పార్టీలో తనకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నందుకు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.