ఉత్సాహంగా ‘రెసోనెన్స్ ఫెస్ట్’

హైదరాబాద్, వెలుగు: రెసోనెన్స్ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న ‘రెసో ఫెస్ట్’ రెండో రోజైన శుక్రవారం సందడిగా కొనసాగింది. ప్రముఖ వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, సినీ నటులు మురళీశర్మ, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, రిటైర్డ్ ఐజీ కాంతరావు హాజరయ్యారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. రెసోనెన్స్ హైదరాబాద్ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇంజనీరింగ్, మెడికల్, కామర్స్, లా ప్రవేశ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆట, పాటలతో స్టూడెంట్లు 
హోరెత్తించారు.