స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ పీఏసీఎస్పాలక కమిటీలో 6వ టీసీ డైరెక్టర్పోస్టు 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. దానికి కోఆప్షన్ మెంబర్‌ను ఎన్నుకునేందుకు మంగళవారం పీఏసీఎస్ ఆఫీస్‌లో సీఈఓ మగ్దూం అధ్యక్షతన చైర్మన్ దూదిపాల నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది డైరెక్టర్లతో మీటింగ్జరిగింది. కోఆప్షన్ సభ్యుడిని ఎన్నకునేందుకు డీసీఓను అనుమతి కోరుతూ తీర్మానం చేసి పంపించారు.
చైర్మన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొంతమంది డైరెక్టర్లు వేర్వేరుగా మంతనాలు జరుపుతున్నారు. 6వ టీసీ డైరెక్టర్పోస్ట్కు గతంలో రాజీనామా చేసిన చాగల్లుకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకుల పేర్లను బీఆర్ఎస్డైరెక్టర్లు కొందరు ప్రతిపాదించగా
కాంగ్రెస్ కు చెందిన కొందరు డైరెక్టర్లు రాఘవాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి పేరును ప్రతిపాదిస్తున్నారని తెలిసింది. సహకరించకుంటే పీఏసీఎస్చైర్మన్పై అవిశ్వాసం పెడతామని కొందరు బాహటంగా చెబుతున్నారు