
రెండు కీలక తీర్మానాలను ఏపీ అసెంబ్లీ అమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో, ద ళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లుగా ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు తనను కోరారని జగన్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, రాయలసీమ జిల్లాల్లో ఆ కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుందన్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించిందని, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీర్మానం చేశాం అని జగన్ తెలిపారు.