
- సింగరేణి సీఎండీకి అధికారుల సంఘం ఇన్ చార్జుల వినతి
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరాం నాయక్‌ను కొత్తగా ఎన్నికైన కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ఇండియా సింగరేణి బ్రాంచి కమిటీ కోరింది. మంగళవారం సంఘం ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, జనరల్సెక్రటరీ పెద్ది నర్సింహులు, వైస్ ప్రెసిడెంట్ పొనగోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు హైదరాబాద్‌లో సీఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు.
అధికారుల ప్రమోషన్ల సమస్యలు, కోలిండియాలో ఉన్న ప్రమోషన్ విధానం, ల్యాప్‌టాప్‌ల అందజేత, ఫ్రీ పవర్, రీజియన్ పరిధిలో కేవీ స్కూల్స్ఏర్పాటు, అప్పిలేట్ బోర్డు మీటింగ్వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అసోసియేషన్‌తో పూర్తి స్థాయి మీటింగ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్, పా) ఎన్ వీకే శ్రీనివాస్, డైరెక్టర్(పీపీ) జి.వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ (ఈఎం) డి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్మూవ్మెంట్) ఆల్విన్, జీఎం(కోఆర్డినేషన్) సురేశ్ వేర్వేరుగా సీఎండీని కలిశారు.