జేఈఈ మెయిన్స్ లో రెజోనెన్స్ విజయ పరంపర

జేఈఈ మెయిన్స్ లో రెజోనెన్స్ విజయ పరంపర

హనుమకొండసిటీ, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్–1 ఫలితాల్లో వరంగల్ రెజోనెన్స్ కు చెందిన 8 మంది విద్యార్థులు 99 పైగా పర్సంటెజ్​ సాధించారు. 54 మంది 95 శాతం, 118 మంది 90 శాతం పర్సంటేజ్​ సాధించి సత్తా చాటారని రెజోనెన్స్ వరంగల్ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు.

ఎం.చరణ్​తేజ 99.89 శాతం, వెంకట్ జశ్వంతో 99.66, సీహెచ్ సాయిదత్తు 99.59,  కె.శిత్తీజ్ 99.56, వి.శశికౌశిక్ 99.48, ఎండీ ఉర్ రహమాన్ 99.27, వీవీ ఫణి హర్షిత్ 99.26, వి.రాజశేఖర్ 99.25 శాతం సాధించారు. విద్యార్థులను చైర్మన్​తోపాటు అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవెందర్ రెడ్డి, లెక్కల రమ్యరెడ్డి, అకడమిక్ డీన్ బీఎస్ గోపాలరావు, కళాశాలప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.