ఖనిజ వనరులనేవి సహజవనరులు. భూ ఉపరితలంపైనా, భూ పటంలో లభిస్తాయి. ఇవి ఒక దేశ పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రణాళిక సంఘం నియమించిన అన్వరుల్ హుడా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 2008లో భారత ప్రభుత్వం నూతన జాతీయ ఖనిజ విధానాన్ని అమల్లో కి తీసుకొచ్చింది .
ఖనిజాల వెలికితీత రెండు విధాలుగా చేపడతారు.
ఓపెన్ కాస్ట్ మైనింగ్
ఖనిజాలను భూ ఉపరితలం నుంచి ఒకటి లేదా రెండు కిలోమీటర్ల నుంచి సేకరించే పద్ధతిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ ఖనిజాలను చాలా ఎక్కువ లోతు నుంచి తవ్వి తీసే విధానాన్ని అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటారు. ఇండియాలో ఖనిజాల అన్వేషణలో నిమగ్నమైన ఉన్న సంస్థలు
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- కలకత్తా
మినరల్ ఎక్స్ ప్లోరే షన్ కార్పొరేషన్- నాగపూర్
ఆయిల్ అండ్ నేచురల్గ్యాస్ కార్పొరేషన్-డెహ్రాడూన్
నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్-హైదరాబాద్
ఆటమిక్ మినరల్ డివిజన్- హైదరాబాద్
ఖనిజాల భౌతిక, రసాయనిక ధర్మాలను ఆధారంగా చేసుకుని వాటిని 4 ప్రధాన రకాలుగా వర్గీకరించారు.
లోహ ఖనిజాలు
ఫెర్రస్ లోహ ఖనిజాలు: ఇనుపధాతువు, మాంగనీస్, నికెల్, క్రోమియం, వెనెడియం, టంగ్‌స్టన్ మొదలైనవి. నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు: బంగారం, వెండి, అల్యూమినియం, సీసం, తగరం, జింక్ మొదలైనవి.
అలోహ ఖనిజాలు
బాక్సైట్, స్టియటైట్, ఆస్‌బెస్టాస్, మైకా, బెరైటీస్, జిప్సమ్, ఇసుక, నైట్రైట్స్, పొటాష్, గ్రాఫైట్ , రత్నాలు, వజ్రాలు, క్వార్ట్జ్.
ఇంధన ఖనిజాలు:
నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు అణుఇంధన ఖనిజాలు యురేనియం, థోరియం, ప్లుటోనియం, జిర్కానియం ఇండియాలో దాదాపు 89 రకాల ఖనిజాల ఉత్పత్తి జరుగుతోంది. దేశవ్యాప్తంగా చూస్తే ఖనిజ నిల్వలు అత్యధికంగా గల ప్రాంతం చోటా నాగపూర్ పీఠభూమి. అందువల్ల దీనిని ‘రూర్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. దీంతో పాటు ద్వీపకల్ప పీఠభూమి, నదీ పరివాణాలలో అధికంగా కేంద్రీకృతమై ఉంటాయి. గంగా–సింధూ మైదాన ప్రాంతాలలో దేశంలోనే అతి తక్కువగా ఖనిజవనరులు లభ్యమవుతాయి. దేశంలో ఖనిజ నిల్వలు అధికంగా గల రాష్ట్రం జార్ఖండ్ కాగా ఒడిశా ఖనిజ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.
ముఖ్యమైన ఖనిజవనరులు
ఇనుప ధాతువు: ఇది ద్వీపకల్ప పీఠభూమిలో అధికంగా దొరుకుతుంది. భూపటలంలో ఇనుము ఎక్కువగా ఆక్సైడ్ రూపంలో ఉంటుంది. ప్రపంచంలో ఇనుపధాతు ఉత్పత్తి లో చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్ వరుసగా 4స్థానాల్లో ఉన్నాయి. ఇండియా నుంచి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం జపాన్. ఇండియాలో మొదటి ఇనుపగనిని 1904లో జార్ఖండ్‌లోని సింగ్భమ్‌లో కనుగొన్నారు. దేశంలోనే ఇనుప ఖనిజ నిల్వలు ఎక్కువగా గల రాష్ట్రం జార్ఖండ్. కానీ ప్రస్తుతం ఉత్పత్తి లో ఒడిశా ఫస్ట్ప్లేస్‌లో ఉంది. దేశంలోనే అతిపెద్ద ఇనుగ గని చత్తీస్‌గఢ్ లోని బైలదిల్లాలో ఉంది. ఇనుపధాతువులోని ఇనుము శాతాన్ని అనుసరించి భూపటలంలో 4 రూపాలలో లభ్యమవుతుంది.
హిమటైట్: ఇందులో 60 నుం చి 70 శాతం ఇనుము ఉంటుంది. ఇండియాలో ఎక్కువ పరిమాణంలో లభ్యమవుతున్న ఇనుము రకం ఇదే. ఇది అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో దొరుకుతుంది. పరిశ్రమలలో ఎక్కువ పరిమాణంలో వాడే ఇనుపధాతు రకం హిమటైటే.
మాగ్నటైట్: ఇందులో 72 నుం చి 80శాతం ఇనుముంటుంది. దీనిని లాం డ్ స్టోన్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత నాణ్యమైనది. కర్ణాటక రాష్ట్రంలో కొద్ది పరిమాణంలో లభ్యమవుతుంది.
లియోనైట్: ఇందులో 50శాతం ఇనుముంటుంది. ముదురు గోధుమ వర్ణంలో దొరికే ఇది అవక్షేప శిలల్లో లభ్యమవుతుంది.
సెడరైట్: ఇందులో 30శాతం ఇనుముంటుంది. దీనిని కార్బొనేట్ ఐరన్ అని పిలుస్తారు. ఇనుప గనుల విస్తరణ రాష్ట్రం విస్తరించిన ప్రాంతాలు చత్తీస్‌గఢ్ బైలదిల్లా, దల్లీరాజ్ హరా మహారాష్ట్ర చంద్రాపూర్, రత్నగిరి, బండారా ఒడిశా గురుమహసాని, కియోంజర్, కిరుబురు కర్ణాటక కుద్రేముఖ్, కెమ్మనగండి, షిమోగ, చిత్రదుర్గ ఆంధ్రప్రదేశ్ ఒబులాపురం, కడప తెలంగాణ ఖమ్మం , కరీంనగర్, వరంగల్ తమిళనాడు సేలం
మాంగనీస్: ఇది భూపటంలో పైరోలుసైట్ రూపంలో లభ్యమవుతుంది. దీనిని ప్రధానంగా ఉక్కు, బ్యాటరీలు, బ్లీచిం గ్ పౌడర్, ఫొటోగ్రఫీ పరిశ్రమలలో వినియోగిస్తారు. మాంగనీస్ తేలికగా ఉండడం వలన విమానాల బాడీ తయారీలో ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ధార్వార్ శిలాస్తరాల్లో దొరుకుతుంది. ప్రపంచంలో మాంగనీస్ నిల్వల్లో జింబాబ్వే, ఇండియా మొదటి, రెండు స్థానాల్లో ఉండగా ఉత్పత్తి లో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇండియాలో మాంగనీస్ నిల్వల్లో ఒడిశా, కర్ణాటక మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి లో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. దేశంలో అతి పురాతనమైన మాంగనీస్ గని శ్రీకాకుళంలో ఉంది. ఇండియా నుంచి మాంగనీస్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం జపాన్.
మాంగనీస్ గనుల విస్తరణ
ఒడిశా కియోం జర్ మధ్యప్రదేశ్ బాలాఘాట్, చిద్వారా బెల్ట్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం, విజయనగరం కర్ణాటక షిమోగ, చిత్రదుర్గ, బళ్లారి, బెల్గాం తెలంగాణ ఆదిలాబాద్
బాక్సైట్: ఇది హైడ్రేటెడ్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది. దీనినే అల్యుమినా అని పిలుస్తారు. పియరీ బెర్టియర్ అనే జియాలజిస్ట్ 1821లో దక్షిణ ప్రావిన్స్ లోని లేస్‌బాక్స్ అనే గ్రామం పేరు మీదుగా ఈ ఖనిజానికి బాక్సైట్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో బాక్సైట్ నిల్వల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా ఇండియా 7వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఉత్పత్తి లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇండియాలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఉత్పత్తిలో ఒడిశా, మహారాష్ట్ర మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.
బంగారం: దీనిని నోబుల్ మెటల్ అని పిలుస్తారు. ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉండగా, వినియోగంలో చైనా, భారత్ మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇండియాలో కర్ణాటక బంగారం ఉత్పత్తి లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కోలార్(కర్ణా టక), రామగిరి(అనంతపురం)
ముఖ్యమైన గనులు.
వజ్రాలు: ప్రస్తుతం వజ్రాల ఉత్పత్తి లో రష్యా ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో నిల్వలు, ఉత్పత్తుల పరంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మొదటి, రెండుస్థా నాలు ఆక్రమించాయి. ఇది కింబర్‌సైట్ శిలాస్తరాల్లో లభ్యమవుతుంది. ఇండియాలో ముఖ్యమైన వజ్రపు గనిపన్నా (మధ్యప్రదేశ్) అభ్రకం(మైకా): దీనిని ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో ఇన్సులేటర్‌గానూ, ఎలక్ట్రాన్ ఇండస్ట్రీలో మైక్రోచిప్స్ రూపంలో, గ్లాస్ ఇండస్ట్రీస్‌లో గట్టితనానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది భూ పటలంలో 3 రూపాల్లో లభ్యమవుతుంది. మాస్కోవైట్ అనేది తెల్లని రంగులో ఉంటుంది. దీనినే ‘రూబిమైకా’ అంటారు. ఇది అత్యంత నాణ్యమైనది. ఫ్లోగోవైట్ పసుపురంగులో ఉంటుంది. దీనినే మెగ్నిషియా మైకా అని పిలుస్తారు. బయోటైట్ నలుపురంగులో ఉంటుంది.
బెరైటీస్(ముగ్గురాయి): నిల్వలు, ఉత్పత్తి పరంగా భారతదేశంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని మంగపేట, అనంతరాజుపేట ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయి. ఇది బేరియం ఆక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది. దీనిని ముడిచమురు వెలికితీయడంలో కందెనగా, వైద్య అవసరాలకు వినియోగిస్తారు.
ఆస్‌బెస్టాస్(రాతినార): ఇది ముఖ్యంగా డోలమైట్, సున్నపు రాయితో కలిసి లభ్యమవుతుంది. దీనిని పెయింటింగ్స్, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ తయారీలో వాడతారు. ఆస్‌బెస్టాస్ ఖనిజ వెలికితీతలో పాల్గొనే కార్మికులు ‘ఆస్‌బెస్టోసిస్’ అనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి గురవుతున్నారు.
సున్నపురాయి: దీనిని సిమెంట్ పరిశ్రమలలోనూ, స్టీల్ ఇండస్ట్రీలోనూ ఉపయోగిస్తారు. దేశంలో నిల్వల పరంగా కర్ణాటక, రాజస్థా న్‌లు మొదటి, రెండు స్థానాలలో ఉండగా, ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు ఫస్ట్, సెకండ్ ప్లేస్‌ల్లో ఉన్నాయి.
సీసం (లెడ్): ఇది గెలీనా అనే సల్ఫైడ్ రూపంలో లభిస్తుంది. దీనిని కేబుల్ కవర్స్, పెయింట్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్ లాండ్‌లలో ఇది ఎక్కువగా లభ్యమవుతుంది. ఇండియాలో సీసం నిల్వలు ఎక్కువగా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నాయి.
బొగ్గు: ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి లో చైనా ప్రథమస్థానంలో ఉండగా, యూఎస్‌ఏ, ఇండియా సెకండ్, థర్డ్ ప్లేస్‌లలో ఉన్నాయి. దేశంలో బొగ్గు రెండు భౌమకాలాలకు చెందిన అవక్షేప శిలల్లో లభ్యమవుతుంది. అవి గోండ్వా నా బొగ్గు, టెర్షియరీ బొగ్గు. గోండ్వానా బొగ్గు: దేశంలో లభ్యమయ్యే బొగ్గులో 90శాతం గోండ్వానా రకానికి చెందినది. ఇది ఎక్కువగా దిగువ గోండ్వానా యుగానికి చెందిన అవక్షేప శిలాస్తరాలలోని దామోదర్ లోయ(జార్ఖండ్), సోన్ (మధ్యప్రదేశ్), మహానది(ఒడిశా), గోదావరి (తెలంగాణ), వార్దా (మహారాష్ట్ర)లలో నిక్షిప్తమై ఉంది. ఇది అత్యంత నాణ్యమైన బొగ్గు.
టెర్షియరీ బొగ్గు: ఇది ఎక్కువగా తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, అసోం , జమ్ముకాశ్మీర్‌లలోని ద్వీపకల్ప, ద్వీపకల్పేతర ప్రాంతా లలో లభ్యమవుతుంది. ఇది తక్కువ నాణ్యత కలది. దేశంలో బొగ్గు నిల్వలలో జార్ఖండ్ ప్రథమస్థానంలో ఉండగా, ఉత్పత్తిలో చత్తీస్‌గఢ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇండియాలో బొగ్గు గనులు గోండ్వానా రకానికి చెందినవి.