
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, పోతారం గ్రామాల్లో నిర్మించనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ఆయా గ్రామాల ప్రజలు కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన సదస్సులను బహిష్కరించారు. శనివారం బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఫ్యాక్టరీ మేనేజరు విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి రసాయనాలు వెలువడయని, కేవలం ఇథనాల్ మాత్రమే తయారు చేస్తామని చెప్పారు.
దీని వల్ల రైతులకు కంపోస్ట్ఎరువు తయారవుతుందని ఎంతోమంది ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కానీ గుగిళ్ల, తిమ్మాయపల్లి , పోతారం, నరసింహులపల్లి గ్రామాల ఫ్యా క్టరీ నిర్మాణం వద్దని తేల్చి చెప్పారు. తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్, సిద్దిపేట రూరల్ సీఐ శీను ప్రజలను శాంతింప చేసి అధికారులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.