హెడ్​ ఫోన్స్​తో డ్రైవింగ్‌‌.. నాలుగు సెకన్లు ఆలస్యం

  • సడన్‌‌గా వచ్చే వెహికల్స్‌‌ గుర్తించడంలో 4 సెకన్ల ఆలస్యం

బైక్‌‌పై వెళ్లేటప్పుడు కొంత మంది హెడ్‌‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తుంటారు. కానీ ఆ సరదానే ప్రాణాల మీదకు తెస్తుంది. సడన్‌‌గా రోడ్డుపై వచ్చే ఇతర వాహనాలను సరిగా అబ్జర్వ్ చేయలేక యాక్సిడెంట్ల బారినపడుతుంటారు. దీనికి కారణం బండి నడిపేటప్పుడు పాటలు వినడం వల్ల మైండ్ కాన్సెంట్రేషన్ పూర్తిగా రోడ్డుపై పెట్టలేకపోవడమే. ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా రుజువు చేసేందుకు కార్ల తయారీ కంపెనీ ఫోర్ట్ ఒక అధ్యయనం చేసింది. కారు, బైక్, సైకిల్.. ఇలా వెహికల్ ఏదైనా సరే, ఇయర్‌‌‌‌ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం లేదా ఇతరులతో ఫోన్‌‌లో మాట్లాడడం చేస్తూ నడిపితే ఆ వ్యక్తి దృష్టి మరలి రోడ్డుపై సడన్‌‌గా వచ్చే వెహికల్స్‌‌ను గుర్తించడంలో నాలుగు సెకన్ల లేట్ అవుతుందని స్టడీలో తేలింది. దీని వల్ల ఊహించని ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని ఫోర్డ్ హెచ్చరించింది.

2 వేల మందితో స్టడీ
ఫోర్డ్ కంపెనీ రెండు వేల మందికి పైగా పార్టిసిపెంట్స్‌‌ని తీసుకుని స్టడీ నిర్వహించింది. వారందరినీ రెండు గ్రూపులుగా చేసి, వర్చువల్ రోడ్ మోడల్ ద్వారా పరీక్షించింది. వారిలో ఒక గ్రూప్‌‌కు హెడ్ ఫోన్స్ ఇచ్చి, మరో గ్రూప్ నార్మల్‌‌గా వర్చువల్ డ్రైవింగ్ చేసేలా సూచించింది. ఆ డ్రైవింగ్‌‌లో వాళ్ల బ్రెయిన్ రియాక్షన్‌‌ను పరిశీలించింది. రోడ్డుపై వెళ్తుండగా ఎదురయ్యే వేర్వేరు పరిస్థితులను వర్చువల్‌‌గా క్రియేట్ చేసి, వాళ్లు ఎలా స్పందిస్తున్నారన్నది నోట్ చేసింది.

50% మందికి యాక్సిడెంట్ లేదా జస్ట్ మిస్
హెడ్ ఫోన్స్‌‌లో మ్యూజిక్ వినడం వల్ల రోడ్డుపై వెహికల్స్ సౌండ్ సరిగా వినలేకపోవడం వల్ల మైండ్ వేగంగా అలర్ట్ కాలేదని ఫోర్డ్​ రీసెర్చర్లు చెప్పారు. ఇది తమ రోడ్, ల్యాబ్‌‌ స్టడీలోనూ తేలిందని చెప్పారు. హెడ్‌‌ఫోన్స్ పెట్టుకోని వాళ్లతో పోలిస్తే, హెడ్‌‌ ఫోన్స్‌‌లో మ్యూజిక్ వింటున్న వాళ్లు యావరేజ్‌‌గా రోడ్డుపై సడన్‌‌గా వచ్చే వాహనాలను గుర్తించి రెస్పాండ్ అవ్వడంలో 4.2 సెకన్ల ఆలస్యం అయినట్లు వర్చువల్ మోడల్ రికార్డ్ చేసిందనితెలిపారు. పార్టిసిపెంట్స్‌‌లో చాలా మంది తమకు తరచూ డ్రైవింగ్‌‌లో హెడ్‌‌ ఫోన్స్ వాడే అలవాటు ఉందని, అయితే ఎక్స్‌‌పరిమెంటల్‌‌గా యాక్సిడెంట్లు అయ్యే టైమ్‌‌ గ్యాప్ ఎంత తక్కువగా ఉందన్నది చూసిన తర్వాత ఇక ఎప్పటికీ డ్రైవింగ్‌‌లో హెడ్ ఫోన్స్ వాడమని చెప్పారని అన్నారు. స్టడీలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది యాక్సిడెంట్‌‌ను ఫేస్ చేయడం లేదా జస్ట్ మిస్ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను చూశారు. ఇప్పుడు వస్తున్న 8డీ సౌండ్ టెక్నాలజీ వల్ల మైండ్ పూర్తిగా డిస్ట్రాక్ట్ అయ్యి అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదని అన్నారు. బ్రిటన్‌‌లో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో మూడు శాతం ఈ హెడ్‌‌ ఫోన్స్ పెట్టుకున్న వాళ్లే ఉన్నారన్నారు.

రోడ్ సేఫ్టీ అవేర్‌‌‌‌నెస్‌‌ కోసం..
ఈ వర్చువల్ మోడల్‌‌ను స్మార్ట్‌‌ఫోన్లలో డౌన్‌‌లోడ్ చేసుకుని సామాన్య ప్రజలు కూడా తేడాను గమనించవచ్చని, దీని ద్వారా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ చేయాలని తాము నిర్ణయించుకున్నామని, త్వరలోనే ‘షేర్‌‌‌‌ ద రోడ్’ అనే పేరుతో అందరికీ అందుబాటులోకి తెస్తామని  ఫోర్డ్ ప్రతినిధి ఎమాన్యుయేల్ లుబ్రని తెలిపారు. స్వయంగా తేడాను ఎక్స్‌‌పీరియన్స్ చేయడం వల్ల రోడ్ సేఫ్టీపై పబ్లిక్‌‌కు అవగాహన పెరుగుతుందని తమ రీసెర్చర్లు దీనిని డెవలప్ చేసినట్లు చెప్పారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేయడం ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో చట్ట వ్యతిరేకమన్న విషయాన్ని ప్రస్తావించారు.