పేద విద్యార్ధికి దాతల అండ.. వీ6, వెలుగు కథనానికి స్పందన

‘చదువుకోవాలని ఉంది సాయం చేయండి’ అంటూ ఓ విద్యార్థి దీన పరిస్థితి గురించి వీ6 వెలుగు ప్రచురించిన వార్తపై స్పందన లభించింది. ఆ పేద విద్యార్థి చేసిన అభ్యర్థనకు మనసున్న ఓ మహరాజు స్పందించారు. ఐఐటీ కాన్పూర్ లో ఏరోస్పెస్ ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించిన భరోత్ రామ్ నాయక్ అనే పేద విద్యార్థికి ఖమ్మం జిల్లా వైరాకు చెందిన బొగ్గుల జయ ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ల్యాప్ టాప్ ను బహూకరించారు. ఉన్నత చదువుల కోసం ఈ ల్యాప్ టాప్ ను బహూకరిస్తునన్నట్లు ఆయన తెలిపారు. తనకు ల్యాప్ టాప్ బహుమతిగా ఇచ్చినందుకు రామ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపహాడ్​కు చెందిన రామ్ నాయక్ ది పేద కుటుంబం.  తండ్రి యాక్సిడెంట్​లో గాయపడి 2015లో మృతి చెందగా.. తల్లి ప్రమీల కూలీ డబ్బులతో తనను, తన తమ్ముడిని చదివించింది. కరీంనగర్​ జిల్లాలోని ట్రెబల్​ వెల్ఫేర్​ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన వీరిద్దరు గతేడాదిలో జరిగిన జేఈఈ అడ్వాన్స్  రాయగా..  ఎస్టీ కేటగిరిలో రామ్​నాయక్​ 710, ​అతని తమ్ముడు లక్ష్మణ్​ నాయక్​1673వ ర్యాంకు సాధించారు.

అయితే  కాన్పూర్​ ఏరోస్పేస్​ ఐఐటీ ఇంజనీరింగ్​ సీటు కన్ఫాం అయిన రామ్ నాయక్.. అక్కడ ఫీజులు చెల్లించే స్థోమత లేక, ఎవరైనా దాతలు సాయం చేస్తే చదువుకుని మంచి పేరు తెస్తానని వీ6 వెలుగు ద్వారా వేడుకున్నాడు. ఆ విద్యార్ధి ఆర్ధిక పరిస్థితిపై వీ6 వెలుగులో ఓ కథనం ప్రచురించడంతో..  ఆ వార్త ద్వారా  అతని పరిస్థితి తెలుసుకొని బొగ్గుల జయప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ల్యాప్ టాప్ ను బహుమతిగా అందించారు.

కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితిలో జేఈఈ ర్యాంకర్