బీజేపీ సభ్యత్వ నమోదు కోసం జిల్లాకో నేతకు బాధ్యతలు

బీజేపీ సభ్యత్వ నమోదు కోసం జిల్లాకో నేతకు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ సభ్యత్వ క్యాంపెయిన్ ను సమీక్షించడానికి ఇన్ చార్జీలను  నియమించినట్టు బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్ చార్జీ ఎన్.రాంచందర్ రావు  తెలిపారు. ఈ మేరకు ఒక్కో జిల్లాకు ఒక్కో నేతను కేటాయించినట్టు వెల్లడించారు. వారంతా  బుధవారం నుంచి 24 వ తేదీ దాకా జిల్లాల్లో పర్యటించనున్నారని చెప్పారు. బూత్ సభ్యత్వ ఫారాలను సేకరించడంతో పాటు జిల్లాల్లో మెంబర్ షిప్ టార్గెట్ ను రీచ్ అయ్యేలా వారికి గైడెన్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. 

హన్మకొండకు కేంద్రమంత్రి బండి సంజయ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, మేడ్చల్ జిల్లాకు ఎంపీ లక్ష్మణ్, నల్గొండకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ కు ఎంపీ ఈటల రాజేందర్, జగిత్యాలకు ఎంపీ అర్వీంద్, సంగారెడ్డికి రఘునందన్ రావు, ఆసిఫాబాద్ కు ఎంపీ నగేశ్, వికారాబాద్ కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, రంగారెడ్డి రూరల్​ కు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అర్బన్​కు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, పెద్దపల్లికి ఎమ్మెల్యే హరీశ్ బాబు తదితరులను నియమించారు.