
రాజ్‌కోట్: తొలి మ్యాచ్‌లో ఓడినా వరుసగా రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన టీమిండియా నాలుగో టెస్టులో పలు మార్పులు చేయనుంది. వర్క్‌లోడ్ దృష్ట్యా సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కండరాల గాయం నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి రానున్నాడు.
నాలుగో మ్యాచ్ రాంచీలో ఈ నెల 23న మొదలవనుంది. ‘ఇండియా మంగళవారం రాంచీకి వెళ్తుంది. బుమ్రాకు రెస్ట్ లభించనుంది. కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫిట్‌నెస్‌కు దగ్గర్లో ఉన్నాడు. నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.