హోటల్ మీల్స్ పార్శిల్... చట్నీ మిస్సింగ్.. రూ. 35 వేలు ఫైన్

హోటల్ మీల్స్ పార్శిల్... చట్నీ మిస్సింగ్.. రూ. 35 వేలు ఫైన్

కస్టమర్ ఆర్డర్ చేసిన మీల్స్ పార్శిల్‌‌లో పచ్చడి (చట్నీ) ఇవ్వనందుకు ఓ హోటల్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకుంది. కస్టమర్‌కు పరిహారం కింద రూ.35 వేలు చెల్లించాలని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.. వివరాల్లోకి వెళ్తే... 

సాధారణంగా మనం వేరే ఊరు వెళితే.. భోజనానికి హోటల్ కు వెళతాం... కొన్ని హోటళ్లలో అక్కడ మెనూను బోర్డులు పెడతారు.  అయితే ఆ మెనూ ప్రకారం కచ్చితంగా వడ్డిచాల్సిందే.. లేకపోతే వారిపై Consumer Courtకు వెళ్లవచ్చు.  అయితే అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు.. పెట్టిందేదో తిని బిల్లు కట్టి వచ్చేస్తారు. తమిళనాడు విల్లుపురం జిల్లా వలుదారెడ్డి పట్టణానికి చెందిన సి ఆరోకియాసామి చనిపోయిన తన బంధువు మొదటి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు ఆహారం పంచిపెట్టాలని భావించాడు. దీంతో 2022 నవంబరు 28న అదే పట్టణంలోని బాలమురుగన్ హోటల్‌లో 25 మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు. 

తమిళనాడు రాష్ట్రం విల్లుపురం బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బాలమురుగన్  ఓ రెస్టారెంట్ లో   అక్కడి భోజనం ధరపై ఆరా తీయగా.. అన్నం, సాంబారు, కరివేపాకు, రసం, మజ్జిగ, దంపులు, ఊరగాయ పచ్చడి, అరటి ఆకులు, పచ్చిమిర్చి కలిపి మొత్తం 11 ఐటెమ్స్‌ ఇస్తామని, భోజనం ఖరీదు రూ.80 అని రెస్టారెంట్ యాజమాని తెలిపాడు. దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ నుంచి భోజనం పార్శిల్‌లను కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. ఇందుకోసం హోటల్‌కు రూ.2,000 చెల్లించాడు. చేతిరాతతో ఓ బిల్లు ఇచ్చిన హోటల్.. అందులో చట్నీకి ఛార్జ్ చేసినట్టు స్పష్టంగా పేర్కొంది. బిల్లులో ఒక్కో పికిల్ ప్యాకెట్‌కు రూ.1 చొప్పున వేశారు. హోటల్ నుంచి పార్శిళ్లను తీసుకెళ్లిన తర్వాత వాటిలో  పచ్చడి మిస్సయినట్టు అతడు గుర్తించాడు.

11 రకాల ఆహారపదార్థాలు ఉన్నాయని చెప్పిన పార్శిల్ భోజనంలో పచ్చళ్లు లేకపోవడంతో నిరాశ చెందిన ఆరోగ్యస్వామి సంబంధిత హోటల్ యాజమాన్యాన్ని ఈ విషయమై ప్రశ్నించాడు. చట్నీ ప్యాకెట్‌లు వేయడం తమ సిబ్బంది మరిచిపోయారని వారు సమాధానం ఇచ్చారు. దీంతో తనకు ప్యాకెట్‌కు రూపాయి చొప్పున రూ.25 తిరిగి ఇవ్వాలని అరోకియాసామి డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించిన హోటల్.. అతడి సరైన సమాధానం కూడా చెప్పలేదు. దీనిపై బాధితుడు విల్లుపురం వినియోగదారుల కోర్టును గతేడాది (2023) సెప్టెంబరులో ఆశ్రయించాడు. పచ్చడికి అదనంగా డబ్బులు వసూలుచేసిన హోటల్ యాజమాన్యం, ప్యాకెట్లను ఇవ్వలేదు సరికదా డబ్బులు వాపసు చేయమంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాడు.

తీర్పు ఏమిటంటే?

ఈ ఫిర్యాదుపై కమిషన్ ప్రెసిడెంట్ సతీవ్ కుమార్, సభ్యులు ఎస్‌ఎం మీరా మెహిదీన్, కే అమల విచారణ చేపట్టి నోటీసులు జారీచేశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు..హోటల్25 యజమానిని ... కస్టమర్ కు  35 వేల 25 రూపాయిలు చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఫిర్యాదుదారుకు కలిగించిన మానసిక వేదనకు పరిహారంగా రూ.30,వేలు.. కోర్టు ఖర్చుల నిమిత్తం  రూ.5 వేలు....  ఊరగాయ ప్యాకెట్లకు రూ.25 .. ఇ లా. మొత్తం రూ.35,025 చెల్లించాలని కోరింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంది. ఒకవేళ అప్పటిలోగా చెల్లించకుంటే రోజుకు 9 శాతం చొప్పున వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.