జూబ్లీహిల్స్‌ చైనా బిస్ట్రో రెస్టారెంట్‌ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు

జూబ్లీహిల్స్‌ చైనా బిస్ట్రో రెస్టారెంట్‌ లో  గడువు ముగిసిన ఆహార పదార్థాలు

హైదరాబాద్ నగరంలోని కొన్ని రెస్టారెంట్లు చూడటానికి హై క్లాస్ గా కనిపిస్తాయి.. కానీ ఫుడ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పాడైపోయిన, కుళ్లిన ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.  ఇలాంటి రెస్టారెంట్లు, హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. మే 31వ తేదీ శుక్రవారం  జూబ్లీహిల్స్‌లోని చైనా బిస్ట్రో అనే రెస్టారెంట్‌పై  దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో స్కామోర్జా చీజ్, పాస్తా, బియ్యప్పిండి, వైట్ వెనిగర్ వంటి  గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు.

ఫ్రిజ్ లో నిల్వ చేసిన ఆహార వస్తువులు తేదీల ప్రకారం ఉపయోగించలేని గుర్తించారు. మయోనైజ్ స్వీట్ సాస్, ప్రీమియం డ్రై ఫ్రూట్స్ జాజికాయ, ఎండు ఖర్జూరాలు, మఖానా, లవంగాలు, పాన్‌కేక్ సిరప్‌లు FSSAI లేబులింగ్ నిబంధనలను పాటించనట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ లో సరైన మూతలు లేకుండానే డస్ట్‌బిన్‌లు తెరిచి ఉన్నాయని తెలిపారు.

ఫుడ్ హ్యాండ్లర్‌ల కోసం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ (FBO) దగ్గర లేవని..  FSSAI లైసెన్స్ ట్రూ కాపీని ప్రాంగణంలో పెట్టలేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు.