- భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రెస్టారెంట్లు, హోటళ్లను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తరుచూ తనిఖీ చేయాలని అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతులు విత్తనాలు, మందులు కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని చెప్పారు.
మోసానికి గురైన వారు వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేసి న్యాయం పొందవచ్చన్నారు. ఉచిత ప్రకటనలను ఆన్లైన్ చూసి మోసపోవద్దన్నారు. ఈ ప్రోగ్రాంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రుక్మిణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్త్రినాథ్బాబు, జిల్లా లీగల్మెట్రాలజీ ఆఫీసర్మనోహర్, డీఈవో వెంకటేశ్వరాచారి, మోటార్వెహికల్ఇన్స్పెక్టర్ మనోహర్, వాలంటరీ ఆర్గనైజర్స్ జూలూరి రఘురామాచారి, బాబు, రియాజ్, ఎల్లయ్య పాల్గొన్నారు.