ఎర్రకుంట చెరువు పునరుద్ధరణ షురూ

సికింద్రాబాద్, వెలుగు : తార్నాక డివిజన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు పునరుద్ధరణ పనులు మంగళవారం మొదలయ్యాయి. లాలాగూడలోని సర్వే నంబర్123 నుంచి 128 వరకు దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలోని ఎర్రకుంట చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, చెరువుల పరిరక్షణ సమితి, పలువురు ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పిర్యాదులు చేశారు. 

దీంతో అధికారులు పరిశీలించి 6 ఎకరాల విస్తీర్ణంలోఎఫ్​టీఎల్ ఉందని నిర్ధారించారు. మారేడుపల్లి తహసీల్దార్ భీమయ్య గౌడ్ పర్యవేక్షణలో ఇరిగేషన్ ఏఈ సుధీర్​కుమార్, అధికారులు మంగళవారం రెండు జేసీబీలతో చెరువు భూముల్లో పెరిగిన చెట్లను, తుప్పలను తొలగించారు.