దేశంలో సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించేందుకు బలమైన వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.
చైర్మన్: ప్రధాన మంత్రి
సభ్యులు: అన్ని రాష్ట్రాల, శాసనసభలు గల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు.
తొమ్మిది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
శాశ్వత ఆహ్వానితులు: 13 మంది కేంద్ర మంత్రులకు స్థానం కల్పించారు.
కొత్త స్టాండింగ్ కమిటీలో చైర్మన్గా కేంద్ర హోంమంత్రి అమిత్షా నియమితులయ్యారు. సీనియర్ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష, అధికార పార్టీ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండనున్నారు.
గతంలో ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ అంతర్రాష్ట్ర మండలి సమావేశాలకు హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు గవర్నర్ కాకుండా ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హాజరుకావాల్సి ఉంటుంది.
ప్రాతినిధ్యం పెంపు: పునరుద్ధరించిన అంతర్రాష్ట్ర మండలిలో జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), తెలుగుదేశం పార్టీ తదితర ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కేంద్ర మంత్రులు ఉన్నారు. శాశ్వత ఆహ్వానితుల సంఖ్య 5 నుంచి 13కు పెంచారు.
గతంలో అంతర్రాష్ట్ర మండలి కూర్పు
చైర్మన్గా ప్రధాన మంత్రి, సభ్యులుగా అన్ని రాష్ట్రాలు, శాసనసభలు గల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర హోంమంత్రితో సహా ప్రధాన నామినేట్ చేసే ఆరుగురు కేబినెట్ మంత్రులు, ప్రధాని నామినేట్ చేసే ఐదుగురు శాశ్వత ఆహ్వానితులు (కేంద్ర మంత్రులు) ఉండేవారు. గత స్టాండింగ్ కమిటీలో ఐదుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు, తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉండేవారు.
అంతర్రాష్ట్ర మండలి
ఆర్టికల్ 263: కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ రాష్ట్రాలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్రాష్ట్ర మండలి ఉండాలని ఆర్టికల్ 263 పేర్కొంటోంది. ఆర్ఎస్ సర్కారియా కమిషన్ 1998, జనవరిలో ఇచ్చిన నివేదిక ప్రకారం శాశ్వత ప్రాతిపదికన ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిళ్లు, ఆర్టికల్ 263 కింద ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. దీని ఆధారంగా 1990, మే 28న వి.పి.సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది.