ఓయూలో పురాతన మెట్ల బావి పునురుద్ధరణ పనులు ప్రారంభం

ఓయూలో పురాతన మెట్ల బావి పునురుద్ధరణ పనులు ప్రారంభం

ఓయూ, వెలుగు: ఓయూ ఎడ్యుకేషన్​ విభాగం ఆవరణలోని పురాతన మెట్లబావి (మహాలఖా బాయి బావి) పునరుద్ధరణ పనులను వీసీ ఎం.కుమార్ సోమవారం ప్రారంభించారు. కల్పనా రమేశ్ నేతృత్వంలో ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు, ఇన్ఫోసిస్, దొడ్ల డెయిరీ సహకారంతో ఈ చారిత్రక బావి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఓయూలోని పురాతన నీటి బావులను గుర్తించి త్వరలో తిరిగి వాడుకలోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్​ పి. లక్ష్మీనారాయణ, ఓయూ గార్డెన్స్, గ్రీన్ బెల్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్​ శ్రీనివాసులుతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.