హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించే ఈసెట్ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. మాసబ్ టాంక్ ఉన్నత విద్యా మండలిలో తెలంగాణ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్ లు కలిసి ఈరోజు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల 330 మంది విద్యార్థులు ఈ సెట్ రాశారని అధికారులు తెలిపారు.
అందులో 22 వేల 365 మంది విద్యార్థులు అర్హత సాధించారని ప్రకటించారు. క్యాలిఫై క్వాలిఫై 95.86శాతం. బీఎస్సీ మ్యాథ్స్ లో పెద్దపల్లికి చెందిన యాదగిరి, కెమికల్ ఇంజనీరింగ్ లో మనోహర్ ఫస్ట్ ర్యాంక్ లు సాధించారు. జూన్ 2 నుంచి ఈసెట్ అడ్మిషన్లు మొదలవుతాయని అధికారులు వెల్లడించారు.