
అందమైన రెజ్యూమ్ పంపించొద్దు.. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో మాకు అనవసరం.. అసలు మీరు చదువుకున్నారో లేదో కూడా నాకు అనవసరం.. మీకు ఆ భాష వచ్చా.. ఈ భాష వచ్చా అని కూడా అడగను.. మీరు ఏ ప్రాంతం వాళ్లు అనేది కూడా నాన్సెస్ ఇష్యూ.. జస్ట్ మీ గురించి 100 పదాల్లో రాసి పంపించండి.. నచ్చితే ఇంటర్వ్యూకు పిలుస్తాం.. ఓకే అనుకుంటే ఆ రోజు జాయినింగ్.. జీతం నెలకు 40 లక్షల రూపాయలు.. నేరుగా బ్యాంక్ అకౌంట్ లో ఒకటో తేదీన డబ్బులు వేస్తాం.. బెంగళూరు ఐటీ కంపెనీ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఐటీ రంగంలో మారుతున్న పరిస్థితులు.. కొత్త టెక్నాలజీకి ఉన్న డిమాండ్ ను స్పష్టం చేస్తుంది. ఈ కొత్త తరహా జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళితే..
అది బెంగళూరుకు చెందిన స్మాలెస్ట్ డాట్ ఏఐ ఐటీ కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డెవలప్ చేస్తోంది. రియల్ టైం ఏఐ ఫర్ ఎవ్విరీ హుమన్ అనే ప్రాజెక్ట్. చేతిలో ప్రాజెక్టులు ఉన్నాయి. క్వాలిటీ ఉద్యోగులే లేరు. ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టినా సరైనోడు దొరకలేదు. దీంతో కంపెనీ కొత్త తరహాలో నోటిఫికేషన్ ఇచ్చింది. జాబ్ పోర్టల్స్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఐటీ ఉద్యోగులు షాక్ అయ్యారు.
రెజ్యూమ్ అవసరం లేదు.. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు అనేది కూడా మేటర్ కాదు. మీరు ఎవరు అనేది మాకు అనవసరం.. మేం చెప్పిన వర్క్ చేయండి.. నెలనెలా జీతం తీసుకెళ్లండి.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. జస్ట్ వర్క్ చూస్తాం.. మా ప్రాజెక్ట్ డెవలప్ చేయటమే మాకు కావాల్సింది. నెల జీతం 40 లక్షల రూపాయలు.. మీ అనుభవం రెండేళ్లు మాత్రమే ఉన్నా పర్వాలేదు.. అసలు అనుభవం లేదు.. ఫ్రెషర్ అయినా పర్వాలేదు.. మీలో సత్తా, దమ్ము ఉంటే చాలు.. మీరు చేయాల్సింది ఒక్కటే.. 100 పదాల్లో మీ గురించి మీరు పరిచయం చేసుకోండి.. ఇప్పటి వరకు మీరు చేసిన పనిని నిరూపించుకునే లింక్స్ పెట్టండి. ఇంటర్వ్యూకు పిలుస్తాం.. మాకు ఓకే అనుకుంటే ఆ రోజే జాయినింగ్ ఇస్తాం.. వారానికి 5 రోజులు.. ఆఫీసుకు వచ్చి పని చేయాలి. ఇలా పోస్ట్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ఐటీ రంగంలో వైరల్ అయ్యింది. నెటిజన్లు, ఐటీ ఉద్యోగులు భిన్నంగా స్పందిస్తున్నారు.
రియల్ టైం AI అంటే మాటలు కాదని.. ఈ ప్రాజెక్టు చాలా చాలా కష్టం అని.. అంత అనుభవం ఉన్న వారు ఇప్పుడు మార్కెట్ లో లేరని.. అందుకే ఆ కంపెనీ ఇలా పోస్ట్ చేసి ఉంటుందని ఐటీ ఉద్యోగులు స్పందిస్తున్నారు. మరికొందరు అయితే.. మారుతున్న టెక్నాలజీకి.. కంపెనీ రిక్వయిర్ మెంట్ ఏ విధంగా ఉందో ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తుంది.. రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలకు వచ్చే ముప్పుకు ఇది సంకేతం అంటున్నారు.. మరికొందరు అయితే రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలు అన్నీ ఈ విధంగానే ఉండొచ్చు.. టాలెంట్ ఉంటే చాలు పని ఇస్తారు.. పని లేకపోతే తీసేస్తారు అనే భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు అయితే.. టాలెంట్ ఉన్నోడికి.. దమ్మున్నోడికి మంచి రోజులు వచ్చాయి అని కామెంట్ చేశారు.. ఇలాంటి కంపెనీ ఎక్కువ రోజులు ఉండదు అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI
— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025
Salary CTC - 40 LPA
Salary Base - 15-25 LPA
Salary ESOPs - 10-15 LPA
Joining - Immediate
Location - Bangalore (Indiranagar)
Experience - 0-2 years
Work from Office - 5 days a week
College - Does not matter…
ఏదిఏమైనా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సృష్టిస్తున్న విధ్వంసానికి ఇది ప్రారంభం మాత్రమే. మారుతున్న కాలానికి తగ్గట్టు అప్ డేట్ కాకపోతే ఐటీ ఉద్యోగులకు ముప్పు తప్పదనే సంకేతాలు ఇస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తుంది. రాబోయే రోజుల్లో టాలెంట్ ఒక్కటే.. కంపెనీకి లాభాలు తెచ్చే ఉద్యోగులు మాత్రమే బతకగలరు అనే సంకేతాలు కూడా ఇస్తుంది ఈ సరికొత్త జాబ్ నోటిఫికేషన్. చూడాలి.. అంత దమ్మున్నోడు.. టాలెంట్ ఉన్నోడు ఆ కంపెనీకి దొరుకుతారా లేదా అనేది.