
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఈ ఏడాది అక్టోబర్‌లో 4.87 శాతానికి తగ్గింది. కొన్ని ప్రొడక్ట్‌ల ధరలు తగ్గడంతో పాటు కిందటేడాది అక్టోబర్‌లో ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉండడంతో బేస్ ఎఫెక్ట్ కారణంగా ఇన్‌ఫ్లేషన్ దిగొచ్చింది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5.02 శాతంగా రికార్డయ్యింది. అక్టోబర్‌లో 4.80 శాతంగా నమోదవుతుందని ఎనలిస్టులు అంచనావేశారు. ఆర్‌బీఐ మీడియం టెర్మ్ టార్గెట్ 4 శాతం కంటే పైన వరుసగా 49 నెలల్లో ఇన్‌ఫ్లేషన్ రికార్డయ్యింది. ఆహార పదార్ధాలు, వెజిటబుల్స్ ధరలను కొలిచే ఇండెక్స్ అక్టోబర్‌లో (నెల ప్రాతిపదికన) 3.4 శాతం పెరిగింది. ఉల్లిపాయల ధరలు పెరగడమే కారణం. సెప్టెంబర్‌తో పోలిస్తే టమాట ధరలు మాత్రం 19 శాతం పడ్డాయి.
ALSO READ : పదేండ్లుగా ప్రజలు దగా పడ్తున్నరు : మాణిక్ రావు ఠాక్రే