Retail Inflation: సామాన్యులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

Retail Inflation: సామాన్యులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

Food Inflation: అనేక త్రైమాసికాలుగా అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ ప్రజలకు శుభవార్త వచ్చింది. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 67 నెలల కనిష్ఠానికి పడిపోయిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో నమోదైన 3.61 శాతం నుంచి ప్రస్తుతం 3.34 శాతానికి దిగి వచ్చింది. 

వాస్తవానికి ఆర్బీఐ ద్రవ్యోల్బం టార్గెట్ 4 శాతం కంటే కిందికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకోవటం ఇది వరుసగా రెండో నెల కావటం గమనార్హం. ఇటీవల రిజర్వు బ్యాంక్ గవర్నర్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటిస్తూ కూడా ఆహార ద్రవ్యోల్బణం తగ్గిందని, పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని అందుకే రేట్ల తగ్గింపులకు తాము నిర్ణయించినట్లు ప్రకటించారు. 

ఇదే క్రమంలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.96 శాతానికి పడిపోయింది. వాస్తవానికి ఇది ఫిబ్రవరి నెలలో 3.75 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. మెుత్తానికి 2025 ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.6 శాతం వద్ద ముగింపును నమోదు చేసింది. అయితే రానున్న కాలంలో ఇది 4 శాతం కంటే కిందికి పడిపోతుందని రిజర్వు బ్యాంక్ అంచనా వేస్తోంది. 

►ALSO READ | Gold Rate: రెండో రోజూ భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు.. నేటి హైదరాబాద్ రేట్లివే..

అలాగే మెుదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 3.6 శాతానికి దిగివస్తుందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఇదే క్రమంలో రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 3.9 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. అయితే ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను వేగంగా తగ్గించటానికి, దూకుడుగా వడ్డీ రేట్ల కోతలకు వెళ్లేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.