ఆగస్టులో ఇన్‌‌ఫ్లేషన్ 3.65 శాతం

ఆగస్టులో ఇన్‌‌ఫ్లేషన్ 3.65 శాతం
  • తెలంగాణ,  ఉత్తరాఖండ్‌‌, ఢిల్లీలో  తక్కువ 

న్యూఢిల్లీ : ఈ ఏడాది జులైతో పోలిస్తే ఆగస్టులో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ కొద్దిగా పెరిగింది. ప్రభుత్వ డేటా ప్రకారం, రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆగస్టులో 3.65  శాతానికి చేరుకుంది. జులైలో ఇది 3.60 శాతంగా నమోదయ్యింది.  ఆర్‌‌‌‌బీఐ పెట్టుకున్న రేంజ్‌‌ 2–6 శాతం మధ్యనే వరుసగా 13 వ నెలలోనూ రికార్డయ్యింది.  

ఆహార పదార్థాల ధరల పెరుగుదలను కొలిచే ఫుడ్ ఇన్‌‌ఫ్లేషన్ జులైలో 5.42 శాతంగా ఉంటే ఆగస్టులో  5.66 శాతానికి పెరిగింది.  కిందటి నెలలో  తెలంగాణ (2.02 శాతం), ఉత్తరాఖండ్‌‌ (2.37 శాతం), ఢిల్లీ (2.52 శాతం) లలో తక్కువ రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ నమోదయ్యింది. అస్సాం, బిహార్‌‌‌‌, హర్యానా, కేరళ, ఒడిస్సా,  ఉత్తరప్రదేశ్‌‌లలో  సగటు కంటే ఎక్కువ ఇన్‌‌ఫ్లేషన్ రికార్డయ్యింది. 

పెరిగిన ప్రొడక్షన్‌‌

పరిశ్రమల ఉత్పాదకతను కొలిచే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్‌‌ ప్రొడక్షన్ (ఐఐపీ) ఈ ఏడాది జులైలో 4.8 శాతం గ్రోత్ నమోదు చేసింది. అంతకు ముందు నెలలో నమోదు చేసిన 4.7 శాతం గ్రోత్‌‌ రేట్‌‌తో పోలిస్తే కొద్దిగా పెరిగింది.