ఈ 8 నగరాల్లో రిటైల్​ స్థలాలకు భారీగా పెరిగిన డిమాండ్​..

ఈ 8 నగరాల్లో  రిటైల్​ స్థలాలకు భారీగా పెరిగిన డిమాండ్​..
  • జనవరి-సెప్టెంబర్‌‌‌‌లో 5 శాతం జంప్​

న్యూఢిల్లీ: మనదేశంలోని టాప్​‌‌‌‌–8 నగరాల్లో ఈ ఏడాది జనవరి-–సెప్టెంబర్‌‌‌‌ మధ్య  షాపింగ్ మాల్స్​లో, హై స్ట్రీట్‌‌‌‌లలో రిటైల్ స్థలాలను లీజుకు ఇవ్వడం దాదాపు 5 శాతం పెరిగింది.   రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌‌‌‌మన్ అండ్​ వేక్‌‌‌‌ఫీల్డ్ డేటా ప్రకారం, గ్రేడ్- ఏ మాల్స్  టాప్ ఎనిమిది నగరాల్లో హై స్ట్రీట్‌‌‌‌లలో ఈ ఏడాది జనవరి–-సెప్టెంబర్​లో 5.53 మిలియన్ చదరపు అడుగుల రిటైల్​స్థలాన్ని లీజుకు ఇవ్వగా, గత ఏడాది ఇదే కాలంలో 5.29 మిలియన్ చదరపు అడుగుల జాగా అమ్ముడయింది. 

  ఈ ఎనిమిది నగరాల్లో - ఢిల్లీ–ఎన్సీఆర్​, ముంబై, చెన్నై, కోల్‌‌‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పూణె,  అహ్మదాబాద్ ఉన్నాయి.    అయితే, షాపింగ్ మాల్స్‌‌‌‌లో రిటైల్ స్థలం అమ్మకం 1.85 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.72 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది.  హైదరాబాద్‌‌‌‌లోని ప్రముఖ హై-స్ట్రీట్ లొకేషన్లలో రిటైల్ స్థలానికి భారీ గిరాకీ కనిపించింది. ఈ నగరంలో సెప్టెంబర్ వరకు 1.72 మిలియన్ చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉండగా, 1.60 మిలియన్ చదరపు అడుగులు లీజుకు ఇచ్చారు.