న్యూఢిల్లీ: టమాట రిటైల్ ధరలు గత నెల రోజుల్లో 22.4 శాతం తగ్గాయని కన్జూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. సప్లయ్ పెరగడంతో రేట్లు దిగొచ్చాయని తెలిపింది. దేశం మొత్తం మీద టమాట యావరేజ్ ధర ఈ నెల 14 నాటికి కేజీకి రూ.52.35 కి తగ్గింది. ఈ ఏడాది అక్టోబర్ 14 నాటికి కేజీకి రూ.67.50 పలికింది.
ఇదే టైమ్‌లో ఢిల్లీలోని అజ్దాపుర్ మండీలో టమాట క్వింటాల్ హోల్‌సేల్ ధర రూ.5,883 నుంచి 50 శాతం తగ్గి రూ. 2,969 కి దిగొచ్చింది. మదనపల్లి (ఆంధ్రప్రదేశ్), పింపల్గాన్ (మహారాష్ట్ర), కొలార్ (కర్నాటక) వంటి కీలక మార్కెట్ ఏరియాల్లో కూడా ధరలు ఇలానే తగ్గాయి.