అసలే నిత్యావసర ధరలు కొండెక్కిన క్రమంలో పెరుగుతున్న ఖర్చుతో సామాన్యుడు నలిగిపోతున్నాడు. ఇలాంటి టైంలో ఫ్రీగా కూరగాయలు వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి... షాపుల మీదకు ఎగబడతారు కదా.. పెద్దపల్లి జిల్లాలో అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. హోల్ సేల్ కూరగాయలు అమ్మే యాజమాన్యం రిటైల్ గా అమ్మడాన్ని నిరసిస్తూ కూరగాయలను ఫ్రీగా వినియోగదారులకు పంపిణీ చేశారు రిటైల్ కూరగాయల షాపు నిర్వాకులు.
కూరగాయలు ఫ్రీ ఇస్తుండడంతో కూరగాయల కోసం జనం ఏగబడ్డారు. దీంతో మార్కెట్ జనాలతో కిక్కిరిసిపోయింది...పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్లో హోల్ సెల్ గా కూరగాయలు అమ్మేవారు రిటైల్ గా అమ్మకూడదని గత రెండు నెలలుగా చెబుతున్నామని, అయినా కూడా వినకుండా ఇష్టారాజ్యంగా హోల్సేల్ వ్యాపారులు రిటైల్ గా అమ్ముతున్నారని వాపోతున్నారు రిటైల్ వ్యాపారాలు.
ALSO READ : ఆగష్టు 30న బజార్ స్టైల్ రిటైల్ ఐపీఓ
ఇలా అమ్మితే.. తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అమ్మ కూడదని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇక చేసేదేమీ లేక వినియోగదారులకు కూరగాయలు ఫ్రీగా పంపిణీ చేసి నిరసన తమ నిరసనను తెలియజేశారు రిటైల్ వ్యాపారులు.