- మొన్నటి వరద ముంపు ఎఫెక్ట్ తో రీ డిజైన్‌కు ప్లాన్
- ఎక్స్ పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటున్న రాష్ట్ర సర్కార్
- వాల్ ఎత్తు పెంచితే మున్నేరుపై బ్రిడ్జిలకు ప్రమాదం
- గోడలను విస్తరిస్తే బెటర్ అంటున్న ఇంజినీర్లు
- రివర్ బెడ్లోని రాళ్లు, గుట్టల చదును చేయాలని సూచన
ఖమ్మం, వెలుగు : మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు బ్రేక్‌పడింది. గత సెప్టెంబర్1న నదికి వచ్చిన వరద ఉధృతితో ఖమ్మం సిటీతో పాటు రూరల్మండలంలోని పలు ప్రాంతాలను మునిగిపోయాయి. దీంతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు నిలిచాయి. వరద తగ్గినప్పటికీ మళ్లీ పనులు ప్రారంభించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరుకు ఇటీవల భారీగా వరదలు వచ్చాయి.
40 ఫీట్ల ఎత్తున నీటి ప్రవాహం వెళ్లడంతో రిటైనింగ్ వాల్ డిజైన్‌పై సందేహాలు తలెత్తాయి. అయితే.. రెండేండ్ల కింద 30.7 అడుగుల మేర వరద ప్రవహించిన ప్పుడు.. అప్పటి అంచనాల ప్రకారం 33 ఫీట్ల ఎత్తుతో రిటైనింగ్ వాల్ నిర్మించాలని అధికారులు ప్లాన్చేశారు. ఈసారి అంతకు మించి ఎత్తున వరద రావడంతో ప్రత్యామ్నయంపై జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దృష్టిపెట్టారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నేరు రిటైనింగ్ వాల్ పై స్పందించారు. ఎత్తు పెంపుపై నిపుణులతో కమిటీ వేసి స్టడీ చేయిస్తామని చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో వరద తగ్గిన తర్వాత వాల్ నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించలేదు.
ముందుగా 33 ఫీట్ల ఎత్తులో ప్లాన్
గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది జులైలో మున్నేరుకు 3.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అది 30.7 ఫీట్ల ఎత్తులో ప్రవహించింది. దీంతో నదికి రెండు వైపులా ఉన్న 20కి పైగా కాలనీలు ముంపు బారిన పడ్డాయి. అనంతరం నది ఒడ్డున ప్రకాశ్ నగర్‌నుంచి గోళ్లపాడు వరకు 8.5 కిలోమీటర్ల మేర ఇరువైపులా కలిపి17 కిలోమీటర్ల మేర రీ ఇన్ఫోర్స్ డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్సీసీ) వాల్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
మున్నేరు మధ్యలోంచి రెండు వైపులా115 మీటర్ల చొప్పున దూరం ఉండేలా 6 మీటర్ల నుంచి11 మీటర్ల(33 ఫీట్లు) ఎత్తులో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి డిజైన్ చేశారు. వాల్‌కు దిగువన ధంసలాపురం వద్ద రెయిన్, డ్రెయిన్వాటర్మున్నేరులో కలిసేలా రూపొందించా రు. దీనికి రూ.690.52 కోట్లతో పాలనా అనుమతులు వచ్చాయి. పది నెలల కింద టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. ఎండాకాలంలో దానవాయిగూడెం సమీపంలో కాంక్రీట్ బెడ్నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం వానాకాలంలో పనులు ఆపివేశారు.
ఎత్తు పెంచకుండా ప్రత్యామ్నాయంగా..
రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచకుండా రెండు గోడల మధ్య వెడల్పు పెంచడం ద్వారా వరద ప్రవాహం తగ్గించొచ్చని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటు న్నారు. ప్రస్తుతం నదికి రెండు వైపులా 115 మీటర్ల చొప్పున భూ సేకరణ చేశారు. ఇక 130 మీటర్ల ఎత్తున గోడలను నిర్మిస్తే.. వీటి మధ్య దూరం 230 మీటర్ల నుంచి 260 మీటర్లకు పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఉన్న డిజైన్మేరకు 19 ఇండ్లు పోతుం డగా.. ఇక వెడల్పు పెంచడం ద్వారా అదనంగా మరో100 ఇండ్లను సేకరించాల్సి ఉంటుంది. ఇండ్లను కోల్పోయే బాధితులకు పరిహారంతో పాటు, రూరల్మండలంలో గతేడాది గుర్తించిన ఎన్ఎస్పీ మిగులు భూమిని ప్లాట్లుగా కేటాయించొచ్చని సూచిం చారు.
అదేవిధంగా మున్నేరు రివర్‌బెడ్‌లో 5 ఫీట్ల ఎత్తు వరకు ఉన్న పెద్ద బండరాళ్లను తొలగిస్తే నీటి ప్రవాహం ఎత్తును కూడా తగ్గించవ చ్చని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా సేకరించాల్సిన భూమి, ఇండ్లకు పరిహారంతో పాటు రివర్ బెడ్‌ను లెవల్ కు మొత్తంగా రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తే ప్రస్తుత డిజైన్‌తోనే రిటైనింగ్ వాల్ నిర్మించొ చ్చని పేర్కొంటున్నారు. అలా కాకుండా రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచితే నదిపై మూడు బ్రిడ్జిలకు ప్రమా దం ఏర్పడు తుందని హెచ్చరిస్తున్నారు. మొన్నటి వరదతోనే ప్రకాశ్ నగర్బ్రిడ్జి డ్యామేజీ అయిందని, నీటి ప్రవాహం ఎత్తు తగ్గిం చాలంటే గోడల మధ్య వెడల్పు పెంచ డంతో పాటు, రివర్ బెడ్ లెవల్‌ను తగ్గించడమే పరిష్కారమంటున్నారు.