ఫేక్​ డాక్యుమెంట్లతో రిటైర్డ్​ ఆర్మీ కల్నల్​ భూమి కబ్జా

ఫేక్​ డాక్యుమెంట్లతో రిటైర్డ్​ ఆర్మీ కల్నల్​ భూమి కబ్జా

సికింద్రాబాద్, వెలుగు: ఫేక్​డాక్యుమెంట్లతో రిటైర్డ్ ఆర్మీ కల్నల్ భూమిని కబ్జా చేసిన ఆరుగురిని కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. రిజిస్ట్రేషన్​ను రద్దు చేయించారు. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, అడిషనల్ డీసీపీ పి.అశోక్​తో కలిసి వివరాలు వెల్లడించారు. సిటీలోని ఈదీ బజారుకు చెందిన ఉబెద్ బిన్ మహమ్మద్(50), బోయిన్​పల్లికి చెందిన షేక్ రవూఫ్ పాషా(39), రసూల్ పురాకు చెందిన షేక్ అమీద్ (40), బాన్సువాడకు చెందిన రతాకాంత్ సాయినాథ్(64), బానోతు భీమ్ సింగ్(40), నిజామాబాద్ కు చెందిన మహమ్మద్ అబీద్(48) ముఠాగా ఏర్పడ్డారు. 

ఫేక్​డాక్యుమెంట్లతో కార్ఖానాకు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఓలేటి కృష్ణారావు(87)కు చెందిన కార్ఖానా గన్​రాక్​ఎన్​క్లేవ్​కోఆపరేటివ్​హౌసింగ్​సొసైటీ పరిధిలోని 450 చ.గ. స్థలాన్ని కబ్జా చేశారు. ఫేక్​ఆధార్, డాక్యుమెంట్లతో ఈ ఏడాది మే నెలలో నిజామాబాద్​కు చెందిన మహ్మద్​ఆబిద్​కు రిజిస్ట్రేషన్​చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో కబ్జా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.