నిజామాబాద్, వెలుగు: తప్పుడు కులం సర్టిఫికెట్తో ఆర్టీసీలో జాబ్ పొంది, రిటైర్డయినఉద్యోగిపై వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు గురువారం కేసు నమోదు చేశారు. 1986లో ఎస్సీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసి, 32 ఏండ్లుగా కండక్టర్‌గా పనిచేసి రిటైర్డయిన నిజామాబాద్బోర్గాం(పి)కి చెందిన ఎం.చంద్రశేఖర్‌పై డిపో మేనేజర్ సంపూర్ణానంద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
1983లో అప్పటి బోధన్తహసీల్దార్ జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్‌పై కొందరు ఫిర్యాదు చేయగా, విచారణ చేసిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు దాన్ని రద్దు చేశారన్నారు. రిజర్వేషన్ ఆధారంగానే సెలక్షన్‌కమిటీ చంద్రశేఖర్‌కు ఆర్టీసీలో జాబ్ఇచ్చిందన్నారు. సంస్థను మోసగించినందున చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని డీఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.