అల్వాల్, వెలుగు: ఇంట్లో అక్రమంగా డిఫెన్స్ మద్యం అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అల్వాల్ లో తుకుంటలో ఉండే అరుణ్ కుమార్ శర్మ కొంతకాలంగా డిఫెన్స్ కు చెందిన మద్యం బాటిళ్లను యూపీ , అసోం, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ, పోలీసులు రైడ్స్ చేశారు. అరుణ్ కుమార్ వద్ద 102 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాటిళ్ల విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుంది. అరుణ్ కుమార్ శర్మ డిఫెన్స్ ఉద్యోగిగా ఇటీవలే రిటైర్ అయ్యారు.
150 మద్యం బాటిళ్లు స్వాధీనం
మెహిదీపట్నం: మంగళ్‌హట్ పీఎస్ పరిధిలో బెల్ట్ షాపు నిర్వహించే లఖన్ సింగ్ ఇంటిపై గురువారం అర్ధరాత్రి సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ కరే టీమ్ ఆకస్మిక దాడులు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద 150 మద్యం బాటిళ్ల స్వాధీనం చేసుకున్నారు.