- విశాఖ ట్రస్ట్ ను కోరిన రిటైర్డ్ ఎంప్లాయీస్
పెద్దపల్లి, వెలుగు: ధర్మారం రైతు వేదిక సమీపంలో లోని ధర్మారం, వెల్గటూర్ ఉమ్మడి మండలాలకు చెందిన విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనానికి నీటి కొరత ఉందని, విశాఖ ట్రస్ట్ నుంచి బోర్ వెల్ మంజూరు చేయించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆదివారం విశాఖ ట్రస్ట్ ప్రతినిధి, ధర్మారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాన్ని ట్రస్ట్ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్తానని కాడే సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీధర్ రావు, కోశాధికారి గంధం రాజయ్య, పొన్నవేని స్వామి తదితరులు పాల్గొన్నారు.