- డీపీఆర్ ను ఆమోదించింది కేసీఆరే
- 3 బ్యారేజీల్లో నీళ్లు నింపుమన్నది ఆయనే
- నీళ్లు నింపడం వల్లే డ్యామేజీ అయ్యాయ్
- హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ చెప్పినట్టే పనిచేశామని వెల్లడి
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ విశ్రాంతి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను కమిషన్ కు అందించారు. కాళేశ్వరం డీపీఆర్ ను అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదించినట్టు విచారణ సందర్భంగా నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లను కమిషన్ కు హ్యాండోవర్ చేశారు.
కాళేశ్వరం డిజైన్లను ఫైనల్ చేయమని కేసీఆర్ చెప్పినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. మినిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు, మూడు బ్యారేజీల వివరాలను కమిషన్ కు అందించారు. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపమే కారణమా? మూడు బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి అప్పటి ప్రభుత్వాధినేత ఆదేశించారని వెంకటేశ్వర్లు బదులిచ్చినట్లు సమాచారం.