
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎథిక్స్ ఆఫీసర్‌గా రిటైర్డ్ జడ్జి, ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య నియమితులయ్యారు. మంగళవారం ఉప్పల్‌లో స్టేడియంలోని హెచ్‌సీఏ ఆఫీస్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌సీఏ సెక్రటరీ దేవ్‌రాజ్, వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కాంటే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.