
- హైదరాబాద్ రీజియన్ చైర్ పర్సన్‌గా సుదర్శన్
- వరంగల్ రీజియన్ చైర్ పర్సన్‌గా అరవింద్ రెడ్డి
- హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏర్పడింది. గతంలో అథారిటీ ఉన్నప్పటికీ చైర్మన్ సహా ఆశించిన స్థాయిలో సభ్యుల నియామకం జరగలేదు. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శివశంకర్ రావును రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ గా, జిల్లా రిటైర్డ్ జడ్జి కె.సుదర్శన్ ను జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (హైదరాబాద్ రీజియన్) చైర్ పర్సన్ గా నియమించారు. ఈ మేరకు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీలో మెంబర్లుగా పి.ప్రమోద్ కుమార్ (రిటైర్డ్ ఐపీఎస్), వర్రె వెంకటేశ్వర్లు (అడ్వొకేట్, ఇన్ఫర్మేషన్ కమిషన్ మాజీ సభ్యుడు), మెంబర్ సెక్రటరీగా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ని నియమించారు. అలాగే జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (హైదరాబాద్ రీజియన్)లో మెంబర్లుగా పి.రామ్మోహన్ (మాజీ జర్నలిస్ట్), రామనర్సింహా రెడ్డి (రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ), మెంబర్ సెక్రటరీగా ఐజీపీ (మల్టీ జోన్-2) ను నియమించారు.
జిల్లా పోలీస్ కంప్లైట్స్ అథారిటీ (వరంగల్ రీజియన్) చైర్‌పర్సన్ గా వై.అరవింద్ రెడ్డి (జిల్లా రిటైర్డ్ జడ్జి), మెంబర్లుగా ఎం.నారాయణ (రిటైర్డ్ ఐపీఎస్), డాక్టర్ సామల రాజేందర్, మెంబర్ సెక్రటరీగా ఐజీపీ (మల్టీ జోన్-1) ని నియమించారు.