
పంజాగుట్ట, వెలుగు: మైనారిటీ విభాగం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఎలా ఇస్తుందని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. ఈ నెల 25న రూ.70 కోట్లతో ఇఫ్తార్ప్లాన్చేసినట్లు తెలిసిందన్నారు. విందుకు పెట్టే ఖర్చుతో గవర్నమెంట్స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవచ్చన్నారు.
డాక్టర్ లుబ్న సర్వాత్మాట్లాడుతూ.. ఇఫ్తార్ముసుగులో అవినీతికి పాల్పడే ఆస్కారం ఉందన్నారు. ప్రభుత్వం సామాన్య ముస్లింలను పక్కన పెట్టి, వీఐపీలకు ఇఫ్తార్ఇస్తోందన్నారు. సొగరా బేగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సనావుల్లాఖాన్, రఫీ, సాహిద్ బేగం, దాసారం నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.