కాళేశ్వరం అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి: ఆకునూరి మురళి

 కాళేశ్వరం అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి: ఆకునూరి మురళి
  • రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్‌‌‌‌ ఆకునూరి మురళిడి మాండ్‌‌‌‌

ఖానాపూర్/కడెం/జన్నారం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం మండల కేంద్రాల్లో, మంచిర్యాల జిల్లా జన్నారంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, జాగో తెలంగాణ ఆధ్వర్యంలో ‘ఓటర్ల చైతన్య బస్సు యాత్ర’నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పదేండ్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి, అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. విద్య, వైద్య రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. కడెం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లిక్కర్, పైసలకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  

మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఆగమైతది..: ఆకునూరి

రాష్ట్రంలోని పింఛన్‌‌‌‌దార్ల ఓట్లు చూసుకునే మన దొర కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ధీమాగా ఉన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు రాష్ట్రమంతా తిరిగి ఓటుపై చైతన్యం తీసుకురావాలి. లేకపోతే మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే తెలంగాణ ఆగం ఆగం అయితది. ఇప్పటికే ప్రభుత్వ విద్య, ఉద్యోగ కల్పనలో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఫెయిలైంది. తస్మాత్ యువత..అని ఆకునూరు మురళి ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఓయూ విద్యార్థి మాట్లాడిన వీడియోను ఆయన శుక్రవారం ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో షేర్ చేశారు. ఓయూ విద్యార్థి చెప్పినవన్ని నిజాలని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయకపోతే రానున్న రోజుల్లో మధ్య తరగతి పిల్లలకు విద్య అందడం కష్టమేనని ఓయూ స్టూడెంట్‌‌‌‌ ఆ వీడియోలో పేర్కొన్నారు.