![తిరుమల కొండపై దారుణం : నందకం కాటేజీలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, అతని భార్య ఆత్మహత్య](https://static.v6velugu.com/uploads/2025/02/retired-police-officer-family-suicide-in-tirumala-cottage_SOifIhKjVr.jpg)
తిరుమల కొండపై ఊహించని దారుణం జరిగింది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కొండపైన కాటేజీలోనే ఇలా జరగటం సంచలనంగా మారింది.
తిరుమల కొండపై నందకం అతిధి గృహంలోని గది నెంబర్ 203లో.. దంపతులు ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. 60 ఏళ్ల శ్రీనివాసుల నాయుడు, 55 ఏళ్ల అరుణ భార్యభర్తలు. శ్రీనివాసులనాయుడు హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యారు. వీరు తిరుపతిలోని అబ్బన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి.. కాటేజీలో ఆత్మహత్య చేసుకోవటం.. అందులోనూ భార్యాభర్తలు ఇలా చనిపోవాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు కారణాలు ఏంటీ అనేది విచారణ చేస్తున్నారు పోలీసులు.
ALSO READ | మహానంది ఆలయంలో అద్భుతం.. ముఖద్వారంలో నాగుపాము ప్రత్యక్షం
విషయం తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. 2025, ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య సమాచారాన్ని తిరుపతిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పిల్లలు, బంధువులు కొండకు వచ్చి.. పోలీస్ విచారణకు హాజరయ్యారు.