డీడీఎస్ ​మహిళల కృషి భేష్

డీడీఎస్ ​మహిళల కృషి భేష్
  • ఎన్​బీపీజీఆర్​ రిటైర్డ్​ ప్రిన్సిపాల్ సైంటిస్ట్​ సోమవర్ల

ఝరాసంగం,వెలుగు :​ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో డీడీఎస్​(దక్కన్​డెవలప్​మెంట్​సొసైటీ) మహిళలు చేస్తున్న కృషి హర్షణీయమని ఎన్​బీపీజీఆర్​( నేషనల్​ బ్యూరో ఆఫ్​ప్లాంట్​జెనెటిక్​రిసోర్సెస్) రిటైర్డ్​ప్రిన్సిపాల్ సైంటిస్ట్​ సోమవర్ల అన్నారు.  మంగళవారం మండల పరిధిలోని మాచునూర్​ గ్రామశివారులో గల పచ్చసాలె ఆవరణలో డీడీఎస్​అధ్వర్యంలో నిర్వహించిన 25వ పాతపంటల ముగింపు జాతరకు ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు డీడీఎస్​ వైస్​ చైర్​పర్సన్​ రుక్మణీ రావు మాట్లాడుతూ..

 మన వ్యవసాయం, మన విత్తనాలు, మన ఎరువులు అనే కాన్సెప్ట్​తో ప్రారంభించి ఈ స్థాయికి వచ్చామన్నారు. అనంతరం చిరుధాన్యాలు పండిస్తూ జీవవైవిధ్యం కాపాడుతున్న మహిళా రైతులను సన్మానించారు. అనంతరం సోమవర్ల మాట్లాడుతూ.. నేడు సాగులో రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం కోల్పోవడమే కాకుండా భూమిలోని సూక్ష్మరేణువులు, పంటలకు ఉపయోగపడే క్రిమికీటకాలు నశించి పోతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో మహిళా రైతులు చిరుధాన్యాలు కాపాడుతూ ఆరోగ్యాన్ని అటు భూసారాన్ని కాపాడడం సంతోషించే విషయమన్నారు. 

జహీరాబాద్​ ఏడీ భిక్షపతి మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్​లో చిరుధాన్యాలకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్​బీపీజీఆర్​ ఫార్మర్​హెడ్​ శరత్​బాబు మాట్లాడుతూ పాత వంగడాలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో కొత్తగా జాతీయ జన్యువనరుల సంస్థను ఏర్పాటు చేసి 10 లక్షల పాత, కొత్త వంగడాలను అందులో పెట్టాలని నిర్ణయించిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్​ మాట్లాడుతూ..

రాష్ట్ర  ప్రభుత్వం వరికి ఇస్తున్న బోనస్​ మాదిరిగానే చిరుధాన్యాలు పండిస్తున్న రైతులకు రూ.1000 బోనస్​ ఇచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డీడీఎస్​ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ దివ్య, నాబార్డ్​ డీడీఎం కృష్ణతేజ, రైతు సంక్షేమ సభ్యుడు భవాణిరెడ్డి, గంగాధర్​, ఎస్ ఐటీ నరేశ్, మాణిక్యం, డీడీఎస్​ మహిళలు పాల్గొన్నారు.