సత్తుపల్లి డిపో ముందు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ధర్నా

సత్తుపల్లి డిపో ముందు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ధర్నా

సత్తుపల్లి, వెలుగు  :  తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల శుక్రవారం సత్తుపల్లి డిపో ముందు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు 2017 సంవత్సరం నుంచి నూతన పే స్కేల్ అమలు చేయాలన్నారు.  2022 లో రిటైర్ అయిన వారికి లీవ్ ఎన్ క్యాష్ చెల్లించాలని కోరారు.  సత్తుపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సూపర్ లగ్జరీ బస్సులో భార్యాభర్తలకు ఫ్రీ సర్వీస్ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  

2017 నుంచి పెరిగిన జీతం బకాయిలు చెల్లించాలని, సంస్థలో రిటైర్ అయి చనిపోయిన కార్మికులకు అంతిమ సంస్కారాలకు ఇచ్చే రూ. 30 వేలు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీను, డిపో సెక్రటరీ ఎస్ పీ రావు, ఆర్ వి రావు,  జివి రావు, సాదు సుధాకర్, దాసు, వసంత్ కుమార్, ఎస్ ఎం ఆలీ తదితరులు పాల్గొన్నారు.