హైదారాబాద్ మీర్ పేటలో భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికిన కేసు విచారణలో విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు.. గురుమూర్తి తన భార్యను ఎలా చంపాడు..ఆ తర్వాత ఏం చేశాడో విచారణలో చెప్పిన విషయాలు అతిభయానకంగా ఉన్నాయి.
భార్యపై అనుమానంతో జనవరి 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పక్కా ప్లాన్ ప్రకారమే నిందితుడు తన భార్యను చంపాడు. ఆ రోజు కూడా గురుమూర్తి, వెంకట మాధవి గొడవపడ్డారు. దీంతో ఆవేశంలో ఉన్న గురుమూర్తి ఆమెను హత్య చేశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి సాక్ష్యాలు లేకుండా చేయాలనుకున్నాడు. ముందుగా భార్య డెడ్‌బాడీని మటన్కొట్టే కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేశాడు.
ALSO READ : కుక్కర్ మర్డర్ : చంపినట్లు ఒప్పుకున్నాడు.. నిరూపించే సాక్ష్యం ఏది.. తలలు పట్టుకుంటున్న పోలీసులు
మొత్తం మాంసాన్ని ఇంట్లో ఉన్న కుక్కర్లో దఫదఫాలుగా వేసి ఉడికించి పీస్పీస్చేశాడు. తర్వాత ఎముకలను కాల్చివేశాడు. తర్వాత పొడిగా చేశాడు. వీటన్నింటిని కవర్లలో వేసుకొని ఒకే చోట వేస్తే దొరికిపోతానని డ్రైనేజీల్లో, మీర్‌పేట చందచెరువులో కలిపాడు. భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ప్రాక్టీస్కోసం కుక్కను చంపాడని తెలుస్తోంది.