
గద్వాల, వెలుగు: ముఖ్యమంత్రి సహాయనిధికి రిటైర్డ్ టీచర్, రైతు లక్ష్మీకాంతరెడ్డి రూ. లక్ష డొనేట్ చేశారు. సోమవారం గద్వాల కలెక్టర్ సంతోష్ కు చెక్కును అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిలదిన్నెకు చెందిన లక్ష్మీకాంతరెడ్డి తన భూమికి వచ్చిన రైతు భరోసా రూ.95,400తో పాటు కొంత డబ్బులు కలిపి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించగా..ఆయనను కలెక్టర్ అభినందించారు.